యేసు ఎవరు ?

బైబిల్ మనకు ఇలా చెబుతోంది: “ప్రభువైన యేసును నమ్మండి, అప్పుడు మీరు రక్షింపబడతారు” (అపొస్తలుల కార్యములు 16:31). కానీ యేసును విశ్వసించాలంటే, మీరు మొదట ఆయనను తెలుసుకోవాలి. కాబట్టి యేసు క్రీస్తు ఎవరు?

దేవుని కుమారుడు

స్పష్టంగా చెప్పవలసిన మొదటి విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు దేవుడు. మరింత ఖచ్చితంగా, అతను త్రియేక దేవుని భాగం. అతనిని తండ్రి అయిన దేవుడు మరియు  పరిశుద్ధాత్మ దేవుడు  లో భాగముగా ప్రత్యేకించి చూపించడానికి   బైబిల్ అతన్ని “దేవుని కుమారుడు” అని పిలుస్తుంది.(ఉదాహరణకు యోహాను  1:18 చూడండి).

దేవుని కుమారుడు ఎప్పుడు ఉనికిలోకి వచ్చాడు?

“కుమారుడు” అనే పదం మొదట కేవలం తండ్రి అయిన దేవుడు మాత్రమే ఉన్నాడని మరియు తరువాత మాత్రమే కుమారుడు జన్మించాడనే ఆలోచనను రేకెత్తించినప్పటికీ, కుమారుడు శాశ్వతమని బైబిల్ స్పష్టం చేస్తుంది. భూమి పునాది వేయకముందే ఆయన అక్కడ ఉన్నాడు. “ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను” (కొలొస్సయులు 1:15-17).కుమారుడైన దేవుడు  శాశ్వతత్వం నుండి ఉండటమే కాదు, ఆయన శాశ్వతంగా కూడా ఉంటాడు: ” నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను!” (ప్రకటన 1:17-18).

ఆది సంఘము  ద్వారా విస్తృతంగా రూపొందించబడిన మొదటి సిద్ధాంతాలలో ఇది ఒకటి, ఎందుకంటే ఇది యేసును స్పష్టంగా అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైనది: “మేము ఒకే ప్రభువును  విశ్వసిస్తున్నాము, యేసుక్రీస్తు, దేవుని యొక్క  ఏకైక కుమారుడు, శాశ్వతమైన  తండ్రి నుండి పుట్టిన అద్వితీయుడు, దేవుని నుండి జన్మించిన దేవుడు. వెలుగు నుండి వచ్చిన  వెలుగు , నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడు; తండ్రితో కలిసి ఉండటము ద్వారా జన్మించాడు, ఒకరి ద్వారా తయారు చేయబడలేదు;అయన ద్వారా, ప్రతిదీ జరిగింది” (నిసెనో-కాన్స్టాంటినోపాలిటన్ క్రీడ్, 381 AD).

దేవుడు మరియు మనిషి

ఇదే విశ్వాసం ఇలా కొనసాగుతుంది: “మన కొరకు మరియు మన రక్షణ కొరకు, ఆయన పరలోకం నుండి దిగివచ్చి, పరిశుద్ధాత్మ మరియు కన్య మరియ ద్వారా నరవతారి గా  అవతారమెత్తి నిజమైన మానవుడయ్యాడు.”

యేసు ఎప్పుడు జన్మించాడు?

సుమారు 2000 సంవత్సరాల క్రితం, దేవుని కుమారుడు బేత్లెహేమ్ నగరంలో మానవ శిశువుగా జన్మించాడు. దీనిని అతని అవతారం (“శరీరంలో రావడం”) అంటారు. యేసు ఒక కన్య  నుండి జన్మించాడు, ఆమెకు  నిశ్చితార్థం జరిగింది, కానీ శారీరకముగా ఎవరిని  కలవలేదు. ఈ గర్భం దేవుని  శక్తితోనే జరిగింది.

యేసు ఒక సామాన్య మానవుడా?

యేసు ఒక సాధారణ ఇశ్రాయేలీయుల కుటుంబంలో పెరిగాడు. అతను పూర్తిగా మానవుడు మరియు భావోద్వేగాలు, అనారోగ్యం మరియు శోధనలు  అనుభవించాడు. కానీ అయన  “సాధారణ” మనిషి కాదు, ఎందుకంటే ఆయన కి పాపం తెలియదు. మరియు అయన  మానవుడిగా ఉన్నప్పుడు, అయన  కూడా దేవుడే. కుమారుడైన దేవుడు అదే సమయంలో 100% దేవుడు  మరియు 100% మానవుడు (ఫిలిప్పీయులు 2:5-8; కొలొస్సీయులు 2:9).

యేసు రక్షకుడు

పాపాత్ములైన మానవులకు పరలోకము ఇవ్వడమే  అవతార లక్ష్యం. దేవుడు మొదటి మానవులను సృష్టించినప్పుడు, వారు పరిపూర్ణులు. కానీ వారు తమ సృష్టికర్తకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు మరియు తద్వారా పాపులుగా మరియు దేవుని తీర్పుకు అర్హులుగా మారారు (ఆదికాండము 3 చూడండి). ఇది వారికే కాదు, వారి పాపపు స్వభావాన్ని వారసత్వంగా పొందిన వారి సంతానానికి కూడా తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది (రోమ ​​5:14-21). మానవత్వం యొక్క పరిస్థితి పూర్తిగా నిస్సహాయంగా ఉంది: వారు దేవుని కోపాన్ని పొందారు మరియు తమను తాము రక్షించుకోలేకపోయారు.

దేవుడు మాత్రమే ఈ నిరాశాజనక పరిస్థితిని మార్చగలడు: “నేను, నేనే ప్రభువును, నేను తప్ప రక్షకుడు లేడు.” (యెషయా 43:11). “దేవుడు లోకాన్ని  ఎంతగానో ప్రేమించాడు, అతను తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు, అతనిని విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకుండా శాశ్వత జీవితాన్ని పొందాలని” (యోహాను 3:16). దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి మరియు దేవుని గురించి ప్రజలకు బోధించడానికి యేసు భూమిపైకి వచ్చాడు. అయన  బోధనలకు అతీంద్రియ అద్భుతాలు మద్దతు ఇచ్చాయి. కానీ అయన  మానవుల స్థానంలో శ్రమ అనుభవించి చనిపోవడానికి కూడా వచ్చాడు. ఆయన  నీతిమంతుడు మరియు పాపం లేనివాడు, కానీ మానవత్వం యొక్క పాపాలను స్వయంగా తీసుకున్నాడు. “మన అతిక్రమముల నిమిత్తము అతడు గుచ్చబడెను; మన దోషములనుబట్టి అతడు నలిగిపోయెను; మనకు శాంతిని కలిగించిన శిక్ష అతని మీద ఉంది, మరియు అతని గాయాలతో మేము స్వస్థత పొందాము” (యెషయా 53). “మనుష్యకుమారుడు కూడా సేవ చేయుంచుకునుటకు  రాలేదు గాని సేవ చేయుటకు మరియు అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను” (మార్కు 10:45). సిలువలో మరణించడం ద్వారా మానవులకు రావలిసిన  శిక్షను భరించడానికి యేసు సిద్ధంగా ఉన్నాడు.

యేసు లేచిన రాజు

యేసు మరణంతో కథ ముగియదు. మూడు రోజుల తరువాత, ఆయన మృతులలో నుండి లేపబడ్డాడు మరియు ఇప్పుడు ఆయన శాశ్వతంగా జీవిస్తున్నాడు.అయన  మానవాళికి తీర్పు తీర్చడానికి మరియు కొత్త స్వర్గాన్ని మరియు కొత్త భూమిని సృష్టించడానికి తిరిగి వచ్చినప్పుడు ప్రపంచం అంతమయ్యే వరకు అయన పరలోకము లో ఉన్నాడు. అయన  నీతితో పరిపాలించే విశ్వానికి శాశ్వతమైన రాజు (లూకా 1:32-33). అందుకే క్రైస్తవులు ఆయనను తమ ప్రభువుగా ఆరాధిస్తారు. మరియు కాలాల ముగింపులో, పరలోకమందును  మరియు భూమిపై మరియు భూమి క్రింద ప్రతి మోకాలు అయన  కోసం వంగి ఉంటాయి మరియు తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ఒప్పుకుంటుంది (ఫిలిప్పీయులు 2:10-11) .

యేసుక్రీస్తుకు చాలా పేర్లు ఉన్నాయి

గాబ్రియేల్ దేవదూత “అత్యున్నతుడైన కుమారుడు” పుట్టినట్లు ప్రకటించినప్పుడు, మరియకు యేసు అని పేరు పెట్టమని చెప్పాడు. అది అతని వ్యక్తిగత మానవ పేరు. దాని అర్థం “రక్షించేవాడు”, ఇది ఖచ్చితంగా యేసు చేసాడు ! బైబిల్లో, “దేవుని కుమారుడు”, “ప్రభువు”, “మన రక్షకుడు”, కానీ “క్రీస్తు” లేదా “మెస్సీయ” వంటి అనేక పేర్లను మనం కనుగొంటాము. ఆ చివరి పదం పాత నిబంధనలో, యేసు పుట్టక ముందు, దేవుడు పంపబోయే రక్షకుని సూచించడానికి ఉపయోగించబడింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న మెస్సీయ ఈయనే అని నిజంగానే, చాలా మంది యూదులు గుర్తించరు.

“మంచి కాపరి”, “మనుష్యకుమారుడు”, “వాక్యం” మొదలైన యేసు లక్షణాలలో కొన్నింటిని సూచించే ఇతర పేర్లు ఇంకా ఉన్నాయి. ఈ పేర్లన్నీ యేసు యొక్క బహుముఖ వ్యక్తిత్వానికి సంబంధించిన కొన్ని అంశాలను వ్యక్తపరుస్తాయి మరియు కొన్నిసార్లు కలిపి ఉంటాయి.

ఒక రోజు, యేసు ఎవరో మనకు పూర్తిగా తెలుస్తుంది

మేము యేసు క్రీస్తు ఎవరో పూర్తిగా అర్థం చేసుకోలేము లేదా వ్యక్తపరచలేము. అయితే ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారు యేసును పూర్తిగా తెలుసుకునే శాశ్వత భవిష్యత్తు కోసం ఎదురుచూడవచ్చు. “ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును”

(1 కొరింథీయులకు 13:12).

మీరు యేసు క్రీస్తును మీ ప్రభువు మరియు రక్షకునిగా విశ్వసిస్తున్నారా?

📁 ,